వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గాంధీపై మాయ వ్యాఖ్యలకు నిరసన

ఆయన పుట్టినరోజును సామాజిక న్యాయ, సామరస్యతా దివస్‌గా కాంగ్రెస్ ప్రకటించి అనేక కార్యక్రమాలు నిర్వహించింది. దీనిపై తమ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాయావతి విరుచుకుపడ్డారు. ఆ పేరుతో దళితులతో కలిసి సహపంక్తి భోజనాలు చేసి అనంతరం రాహుల్ ఢిల్లీలో తన చేతులను సబ్బుతో కడుక్కుంటారని ఆమె అన్నారు. ఇలాంటి నాటకాలను మహాత్మగాంధీ తన జీవితపర్యంతం ఆడారని, వీటిని దళితులు నమ్మరని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గాంధీని కించపరిచినందుకు ఆమె క్షమాపణలు చెప్పాలని లేదా ఉద్యమం చేస్తామని పార్టీ అధికార ప్రతినిధి సుభోద్ శ్రీవాస్తవ హెచ్చరించారు.