ఐదుగురు కుటుంబ సభ్యుల ఆత్మహత్య
నల్లగొండ: నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన హోంగార్డు కోడి సైదులు తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మామిళ్లగడ్డలో నివాసం ఉంటున్న సైదులు తన ఇద్దరు భార్యలు వెంకటమ్మ, నాగలక్ష్మి, కుమార్తెలు శివరాణి, రేణుకలు బుధవారం రాత్రి శీతల పానీయంలో పురుగుమందు కలుపుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
సైదులు డిఎస్పీ కార్యాలయంలో హోంగార్డుగా పని చేస్తున్నాడు. గత పది రోజులుగా అతను విధులకు హాజరు కావడం లేదని తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు.












Click it and Unblock the Notifications