చిత్రకూట్ లో నలుగురు పోలీసులు బలి
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని చిత్రకూట్ జిల్లాలో మూడు రోజులుగా బందిపోట్లకు, పోలీసులకు మధ్య జరుగుతున్న ఎదురుకాల్పుల్లో నలుగురు పోలీసులు మృతి చెందారు. జమేలి అనే ప్రాంతంలో బందిపోట్లు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు ఆ గ్రామానికి వెళ్లి చుట్టుముట్టారు. దీంతో బందిపోట్లు పోలీసులపై కాల్పులు జరిపారు. స్థానికుల ఇళ్లలో దాక్కుని బందిపోట్లు పోలీసులపైకి కాల్పులు జరుపుతున్నారు. ఈ ఎదురు కాల్పులు మూడు రోజులుగా కొనసాగుతున్నాయి.
బందిపోట్లలో పేరు మోసని ఘనశ్యాం కేవత్ ఉన్నాడనే సమాచారంతో స్పెషల్ టాస్క్ ఫోర్సు పోలీసులు ఆ గ్రామాన్ని చుట్టుముట్టారు. తాము గ్రామాన్ని చుట్టుముట్టారమని, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కోరామని అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ బ్రిజాల్ గురువారంనాడు చెప్పారు. పోలీసుల నుంచి తప్పించుకోవడాని ఘనశ్యాం గురువారం తెల్లవారు జామున రెండున్నర గంటలకు విఫలయత్నం చేశాడు.












Click it and Unblock the Notifications