• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షైనీ అహుజాకు డిఎన్ఎ పరీక్షలు

By Staff
|

Shiny Ahuja
ముంబయి: తన పని మనిషిపై అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కుంటున్న నటుడు షైనీ అహుజాకు డిఎన్ఎ పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ కేసులో కీలకమైన సాక్ష్యాధారాలు లభించగలవని భావిస్తున్నారు. కాగా, పోలీసులు బాధితురాలి పాఠశాల సర్టిఫికెట్ ను సంపాదించారు. దాన్ని బట్టి ఆమె వయస్సు 20 ఏళ్లు అని తేలింది.

కలినాలోని ఫోరెన్సిక్ లాబొరేటరీకి బాధితురాలి రక్తం నమూనాలు, ఇతర నమూనాలను అందించారు. షైనీ ఇంటిలో స్వాధీనం చేసుకున్న వస్త్రాలపై సెమెన్ గుర్తులున్నాయా, లేదా అనే విషయాన్ని తేల్చాలని పోలీసులు లాబొరేటరీని కోరారు. షైనీని మరి కొంత కాలం తమ కస్టడీలో ఉంచాలని పోలీసులు కోర్టును కోరనున్నారు. షైనీ తప్పు చేశాడని చెప్పడానికి పలు ఆధారాలు లభించాయని పోలీసులు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X