హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెరాస సమావేశం: కెసిఆర్ పై ఒత్తిడి

By Staff
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: పార్టీ అధ్యక్ష పదవికి కె. చంద్రశేఖరరావు చేసిన రాజీనామాపై చర్చించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విస్తృత స్థాయి సమావేశం సాగుతోంది. కెప్టెన్ లక్ష్మీకాంత రావు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని కోరుతూ సమావేశం తీర్మానం చేసే అవకాశం ఉంది. అయితే, తాను రాజీనామాకు కట్టుబడి ఉన్నట్లు కెసిఆర్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఒకవేళ రాజీనామా వెనక్కి తీసుకోవడానికి కెసిఆర్ నిరాకరిస్తే ప్రస్తుత కమిటీని రద్దు చేసి అడ్ హాక్ కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ సమావేశానికి కె. చంద్రశేఖర రావుతో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేసిన విజయశాంతి కూడా హాజరు కాలేదు.

సమావేశానికి కెసిఆర్ కుమారుడు కెటి రామారావు మాత్రం హాజరయ్యారు. ఏమి జరిగేది తనకు ఇప్పుడే తెలియదని, ఏ విధమైన వ్యాఖ్య చేయడానికైనా ఇది సమయం కాదని కెటి రామారావు మీడియా ప్రతినిధులతో అన్నారు. కాగా, కెసిఆర్ కు వ్యతిరేకంగా సమావేశంలో నినాదాలు చేసిన ఒక వ్యక్తిపై తెరాస కార్యకర్తలు విరుచుకుపడ్డారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పార్టీ పదవులకు రాజీనామా చేసిన విజయశాంతి కెసిఆర్ రాజీనామాను ఉపసంహరించుకోకపోతే తాను కూడా వెనక్కి తగ్గబోనని అంటున్నారు.

కెసిఆర్ తో శాసనసభ్యుడు హరీష్ రావు శనివారం ఉదయం చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా, నాయని నర్సింహారెడ్డి కెసిఆర్ నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈటెల రాజేందర్ వంటి నేతలు కెసిఆర్ కు పూర్తి మద్దతు అందజేస్తున్నారు. కెసిఆర్ లేకుంటే తెలంగాణ ఉద్యమం ఉండదని ఈటెల రాజేందర్ అన్నారు. రాజీనామాను ఉపసంహరించుకోవాలని కోరుతూ తెరాస కార్యకర్తలు తెలంగాణ భవన్ వద్దనే కాకుండా కెసిఆర్ నివాసం వద్ద కూడా ధర్నాలు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X