హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ రాజీనామా తిరస్కరణ

By Staff
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్ష పదవికి కెసిఅర్చేసిన రాజీనామాను పార్టీ సీనియర్‌ నేతలంతా తిరస్కరించినట్లు నాయిని నరసింహారెడ్డి చెప్పారు. అందుబాటులో ఉన్న సీనియర్‌ నేతలంతా కలిసి కెసిఅర్రాజీనామా లేఖపై ప్రాథమికంగా చర్చించినట్లు ఆయన శుక్రవారం రాత్రి తెలిపారు. ఇదే తుది నిర్ణయం కాదని, దీనిపై మరింత లోతుగా చర్చించేందుకు శనివారం అత్యవసరంగా పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. తెరాస నియమావళి ప్రకారం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, మండల కార్యవర్గ సభ్యులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచుల సమక్షంలో రాజీనామానుఆమోదించటంపై తుది నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కెసిఅర్రాజీనామా ఓ నాటకమని తెరాస అసమ్మతి నేతలు వ్యాఖ్యానించడంపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. వారి డ్రామాలు కూడా అందరికీ తెలుసని నాయిని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇంట్లో అసమ్మతి నేతలంతా మంతనాలు జరిపారని, అక్కడ మొదలైన కుట్ర ముఖ్యమంత్రి కార్యాలయం మీదుగా ఇంతవరకూ వచ్చిందని ఆరోపించారు. కేసీఆర్‌ను ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయాలని అడిగే అధికారం మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్‌ కు లేదన్నారు.

కెసిఅర్లేని తెలంగాణ ఉద్యమాన్ని ఎవరూ ఊహించట్లేదని ఆ పార్టీ నేత టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ అంశాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకు వెళ్లిన కెసిఅర్సమైక్యవాదులు కల్పించే అడ్డంకులన్నింటినీ తట్టుకుని ముందుకు సాగారని చెప్పారు. ఆయన లేకుండా తెలంగాణ రాదని స్పష్టం చేశారు. పార్టీలో కొంతమంది అసమ్మతులు సమైక్యవాదుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి ఉద్యమాన్ని బలహీనపరిచే విధంగా ప్రవర్తించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తన కుటుంబంపై బురద జల్లుతూ వారు చేసిన విమర్శలకు మనస్తాపం చెంది కెసిఅర్రాజీనామా చేశారని తెలిపారు. కేసీఆర్‌నుద్దేశించి అసమ్మతి నేతలు వాడిన భాష, వారి మాటలు అత్యంత హేయమైనవని తెరాస శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్‌ పేర్కొన్నారు. అసమ్మతి నేతల వ్యవహారంతో పార్టీకి కొంత నష్టం వాటిల్లవచ్చేమోగానీ మొత్తంగా ఏదో అయిపోయిందనుకోవడం లేదని నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X