వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జార్ఖండ్ లో పేలిన నక్సల్స్ మందుపాతర
జంషెడ్పూర్: ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ మావోయిస్టులు 5 రాష్ట్రాలలో రెండు రోజుల పాటు బంద్ ను పాటిస్తున్నారు. ఈ సందర్భంగా వారు జార్ఖండ్ లో సోమవారం విధ్వంసాలకు పాల్పడ్డారు. జంషెడ్పూర్ లో మందు పాతర పేల్చటంతో ఓ పోలీసుజీపు ధ్వంసం కాగా సరాయికేలాలో రైల్వేట్రాక్ ను పేల్చివేశారు.
జార్ఖండ్ లోని బారామరాలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. మందుపాతర నిరోధ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని నక్సల్స్ మందుపారత పేల్చారని, దాని వల్ల పెద్ద ప్రమాదం సంభవించలేదని, ప్రాణ నష్టమేమీ జరగలేదని ఈస్ట్ సింగ్ భూమ్ పోలీసు సూపరింటిండెంట్ నవీన్ కుమార్ సింగ్ చెప్పారు.