వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాల్పుల విరమణకు మావోలు సిద్ధం
కోల్ కత్తా: పశ్చిమ బెంగాల్లోని లాల్ గఢ్ లో సాయుధ బలగాలను ఉపసంహరిస్తే తాము కాల్పుల విరమణకు సిద్ధమేనని మావోయిస్టులు చెప్పారు. పశ్చిమ బెంగాల్ లోని లాల్గఢ్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మావోయిస్టులు ఇన్న రోజులుగా తమ పట్టును వీడకుండా పోరాడారు. అయితే సైన్యం, ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి లాల్ గఢ్ ను క్రమేణా విముక్తం చేస్తున్నాయి. ఇప్పటికే 22 గ్రామాలను సైన్యం విముక్తం చేసి తమ సత్తా చాటింది. దీంతో మావోయిస్టులు కొంత దిగివచ్చారు.
సాయుధ బలగాలను ఉపసంహరించి తమతో చర్చలకు ప్రభుత్వం సిద్ధపడాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. ఆదివారంనాడు లాల్ గఢ్ ను సందర్శించిన మేధావులు ఏర్పాటు చేస్తే తాము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలకు సిద్ధమని మావోయిస్టు నాయకుడు సాగర్ ఒక ప్రకటనలో చెప్పారు.