హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎస్ ఎస్పీ యాదవ్ కు వైయస్ చీవాట్లు

By Staff
|
Google Oneindia TeluguNews

SSP Yadav
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర డిజిపి ఎస్ఎస్పీ యాదవ్ ను చీవాట్లు పెట్టినట్లు సమాచారం. ఇటీవల ఆయన ఎన్నికలసంఘం కమిషనర్ ఐవి సుబ్బారావుతో వివాదానికి దిగారు. దీనిపై ముఖ్యమంత్రి డిజిపిపై మండిపడినట్లు తెలుస్తోంది. తనను తొలగించడానికి కారణాలను మాత్రమే అడుగుతూ ఐవి సుబ్బారావుకు లేఖ రాశానని డిజిపి ముఖ్యమంత్రికి సర్దిచెప్పడానికి ప్రయత్నించినట్లు సమాచారం. అయినా ముఖ్యమంత్రి సంతృప్తి చెందలేదని సమాచారం.

ఇతర ఐపియస్ అధికారుల పట్ల ఎస్ ఎస్పీ యాదవ్ వ్యవహరిస్తున్న తీరును కూడా ముఖ్యమంత్రి తప్పు పట్టినట్లు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రిని ప్రశంసలతో ముంచెత్తడంతో యాదవ్ ను ఎన్నికల సంఘం డిజిపి బాధ్యతల నుంచి తప్పించింది. వైయస్ రాజశేఖర రెడ్డి తిరిగి అధికారంలోకి రాగానే యాదవ్ ను తిరిగి డిజిపిగా నియమించారు. ఆ తర్వాత ఐవి సుబ్బారావుతో ఆయన లేఖల యుద్ధానికి దిగారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X