హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంత మాంద్యం చూడలేదు: రంగరాజన్

By Staff
|
Google Oneindia TeluguNews

Rangarajan
హైదరాబాద్: ప్రపంచాన్ని చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం ఎంతకాలం ఉంటుందో తెలియదని ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ సి.రంగరాజన్‌ వ్యాఖ్యానించారు. మాంద్యం ఎప్పటివరకు ఉంటుందో తెలియదని, పరిస్థితి ఎంత తీవ్రమవుతుందో అర్థం కాని వాతావరణం నెలకొందని, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక మాంద్యం ఇదేనని అని అన్నారు. ఐఐపీఎం హైదరాబాద్‌ స్నాతకోత్సవం లో మంగళవారంనాడు ఆయన ప్రసంగించారు. "అంతర్జాతీయ ఆర్థికం సంక్షోభం...భారత్‌ పై ప్రభావం" అన్న అంశంపై విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం ప్రపంచం క్లిష్టమైన సమయాన్ని ఎదుర్కొంటోందని, పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం అధికారికంగా ఆర్థికమాంద్యాన్ని ఎదుర్కొంటున్నాయని చెప్పారు. గత ఆర్నెల్లుగా వృద్ధి రేటు తగ్గిపోయిందన్నారు. "2007-08లో దేశ వృద్ధిరేటు 9 శాతం ఉండగా...2008-09లో 6.7 శాతానికి తగ్గింది. ప్రస్తుత ఏడాదీ వృద్ధిరేటు ఆశాజనకంగా ఉండే అవకాశం లేదు" అని చెప్పారు.అంతర్జాతీయంగా ప్రస్తుత పరిస్థితికి లేమన్‌బ్రదర్స్‌ సంస్థ విఫలమయ్యే పరిస్థితులు ఏర్పడటమే కారణమన్నారు.

ఆర్థిక సంస్థలను అదుపులో ఉంచాల్సిన నియంత్రణ వ్యవస్థలు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించలేకపోయాయని అభిప్రాయపడ్డారు. అదే విధంగా మార్కెట్‌ వాస్తవ పరిస్థితిని సరైన అంచనా వేయకుండా రేటింగ్‌ ఏజెన్సీలు ఇచ్ఛానుసారం రేటింగ్‌లు ఇవ్వడంతో ఒక్కసారిగా బూమ్‌ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ప్రస్తుతం ఈ సంక్షోభం స్థిరాస్తి రంగంపై ప్రభావం చూపనుందన్నారు. విదేశాల్లో భారతీయ బ్యాంకుల శాఖలు తక్కువగా ఉండటం వల్ల సంక్షోభం ప్రభావం మన బ్యాంకులపై ఎక్కువగా లేదని విశ్లేషించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X