వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లాల్ గర్ లో మందుపాతర పేలుడు
లాల్గఢ్: పశ్చిమబెంగాలలోని లాల్గఢ్ ప్రాంతంలో శుక్రవారం మావోయిస్టులు మందు పాతర పేల్చారు. మిడ్నపూర్ జిల్లాలోని ఓ అడవి సమీపంలో భద్రతా దళాలు గాలింపు జరుపుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. పేలుడు జరిగిన వెంటనే కాల్పులు కూడా జరిగాయి. రాంగఢ్ నుంచి భద్రతాదళాలు పింగ్బని వైపు వెళుతుండగా కాడసోల్ అడవి సమీపంలో పేలుడు జరిగింది. ఆ సంఘటనలో పోలీసులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసు అధికారులు తెలిపారు. బలగాలు అటవీ ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంటున్నాయని, బలగాలు ముందుకు సాగుతున్నాయని ఐజిపి (శాంతిభద్రతలు) రాజ్ కనోజియా చెప్పారు.