వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిఆర్పీఎఫ్ కు మావోల ప్రతిఘటన
కడసోల్: లాల్ గడ్ విముక్తికి దిగిన ప్రభుత్వ సాయుధ బలగాలకు కడసోల్ అడవుల్లో మావోయిస్టుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. కడసోల్ నుంచి ఉత్తరానికి, లాల్ గడ్ నుంచి దక్షిణానికి సాయుధ బలగాలు శనివారం కదిలాయి. మావోయిస్టులు మందుపాతరలను పేల్చడమే కాకుండా బలగాలతో ఎదురు కాల్పులకు దిగారు. కడసోల్ అడవుల్లో చిత్రకూట్ వద్ద సాయుధ బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
లాల్ గడ్ నుంచి దక్షిణాదికి తరలుతున్న సాయుధ బలగాలకు ప్రతిఘటన ఎదురు కావడం లేదు. కడసోల్ అడవుల్లో గాలింపు జరుపుతున్న సాయుధ బలగాలకు మావోల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. ఆపరేషన్ కీలకమైన దశకు చేరుకుందని సిఐడి డిఐజి (ప్రత్యేక ఆపరేషన్ గ్రూప్)ఎస్ ఎన్ గుప్తా చెప్పారు.