ఎడ్ సెట్ ఉత్తమ ర్యాంకర్లు
హైదరాబాద్: ఎడ్ సెట్-2009 ఫలితాల విడుదలతో పాటు ఆయా విభాగాల్లో ప్రథమ, ద్వితీయ ర్యాంకులు సాధించిన అభ్యర్థుల పేర్లను, సబ్జెక్ట్‌ల వారీగా ఉత్తీర్ణత శాతాలను ప్రాథమిక మంత్రి మాణిక్య వరప్రసాద్ వెల్లడించారు. గణితంలో 99.66, భౌతికశాస్త్రంలో 99.7, జీవశాస్త్రంలో 99.3, సాంఘికశాస్త్రంలో 99.27, ఇంగ్లీష్ లో 98.18 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సబ్జెక్ట్ లలలో ప్రథమస్థానం సంపాదించిన అభ్యర్థుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
- గణితం ప్రథమ ర్యాంకు: ఉత్పల(హైదరాబాద్), రెండో ర్యాంకు: హరిత(మెదక్)
- భౌతికశాస్త్రం ప్రథమ ర్యాంకు: తోట భరత్ కుమార్(వరంగల్), రెండో ర్యాంకు: నవీన్ గౌడ్(హైదరాబాద్)
- జీవశాస్త్రం ప్రథమ ర్యాంకు: సమీనా ఫిర్దోష్(హైదరాబాద్), రెండో ర్యాంకు: సుధాకర్(విశాఖ)
-సాంఘికశాస్త్రం ప్రథమ ర్యాంకు: ముద్దం సురేష్(కడప), రెండో ర్యాంకు: మద్దిలేటి మట్టా(కర్నూలు)
-ఇంగ్లీష్ ప్రథమ ర్యాంకు: డేనియల్ రాజు(తూర్పు గోదావరి), రెండో ర్యాంకు: కాసుల రవికుమార్(వరంగల్)












Click it and Unblock the Notifications