హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రజా భద్రతా సలహా కమిటీకి కెవిపి

By Staff
|
Google Oneindia TeluguNews

KVP Ramchandra Rao
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజల భద్రత, రక్షణపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందించడానికి ఉన్నతస్థాయి సలహా కమిటీని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.రమాకాంతరెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిటీ ఛైర్మన్‌గా రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావును నియమించింది. కో-ఛైర్మన్‌లుగా ప్రధాన కార్యదర్శి రమాకాంతరెడ్డి, డీజీపీ ఎస్‌.ఎస్‌.పి.యాదవ్‌ లను ఎంపికచేసింది. కమిటీలో ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ మిశ్రా, ఇంటెలిజెన్స్‌ అదనపు డీజీపీ అరవిందరావు, రాష్ట్ర అగ్నిమాపక, అత్యవసర సర్వీసుల ఛైర్మన్‌ అరుణ బహుగుణ, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ కేసీ రెడ్డి ఉంటారు. గత ఏడాది అక్టోబరులో ఇదే తరహాలో కేవీపీ ఛైర్మన్‌గా ప్రజావ్యవహారాలు, సౌకర్యాలు, సంక్షేమ కార్యక్రమాల సలహా సంఘం ఏర్పాటైంది. అది కొత్త ప్రభుత్వంలోనూ కొనసాగుతోంది.

ప్రజల భద్రత, రక్షణ హోంశాఖ పరిధికి సంబంధించిన అంశాలు. వీటిపై సలహా కమిటీని వేస్తూ హోంమంత్రి సబితాఇంద్రారెడ్డికి ప్రాతినిధ్యం కల్పించకపోవడం ప్రభుత్వవర్గాల్లో చర్చనీయాంశం అయింది. డీజీపీ, ఇతర పోలీసు ముఖ్య అధికారులను సభ్యులుగా చేర్చి హోంమంత్రిని విస్మరించడం ద్వారా ఆమె ప్రాధాన్యాన్ని తగ్గించినట్లు అయింది. దేశంలోనే హోంశాఖను తొలిసారిగా మహిళకు ఇచ్చిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఇటీవల వార్తల్లో చోటుచేసుకుంది. ఇంతలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వంలో అత్యంత శక్తిమంతుడైన కెవీపీ రామచంద్రరావు ఈ కమిటీ ఛైర్మన్‌గా ఉండటంతో ప్రజల భద్రత, రక్షణకు సంబంధించిన అంశాలలో సహజంగానే కమిటీ అభిప్రాయాలే ప్రభుత్వంపై ప్రభావాన్ని చూపుతాయని, ఇది సబితా ఇంద్రారెడ్డి పాత్రను పరిమితం చేస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో కమిటీ పనితీరు ఎలా ఉండాలో కూడా మార్గదర్శకాలు పొందుపర్చింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X