వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిజంగానే భర్త కోసం చూస్తున్నా: రాఖీ

By Staff
|
Google Oneindia TeluguNews

Rakhi Sawant
న్యూఢిల్లీ: రాఖీ కా స్వయంవర్ కార్యక్రమం ద్వారా జీవిత భాగస్వామిని ఎన్నుకోవడానికి నిజాయితీగానే ప్రయత్నిస్తున్నానని బాలీవుడ్ నటి రాఖీ సావంత్ చెప్పారు. సంచలన వ్యాఖ్యల ద్వారా, కార్యక్రమాల ద్వారా ఎప్పుడు వార్తల్లో ఉండే రాఖీ సావంత్ - షో పబ్లిసిటీ స్టంట్ గానీ వినోదాత్మక ప్రదర్శన గానీ కాదని, నిజాయితీ జీవిత భాగస్వామి కోసం చూస్తున్నానని, తానేమిటో అర్థం చేసుకుని తనతో జీవితాన్ని పంచుకునే వ్యక్తి కోసం అన్వేషిస్తున్నానని ఆమె అన్నారు.

చాలా మంది సెలిబ్రీటీలకు మాదిరిగా తన వ్యాఖ్యలను కూడా చాలా సార్లు వక్రీకరించారని, తానేమిటో ఈ స్వయంవరం నిక్కచ్చిగా చెబుతుందని, అందరు ఆడపిల్లల మాదిరిగానే కుటుంబం, ప్రేమించే భర్త, పిల్లలు కావాలని తాను కోరుకుంటున్నానని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆదర్శ భార్య కాగలగే లక్షణాలు తనలో ఉన్నాయని ఆమె చెప్పుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X