• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షైనీ అహుజా కస్టడీ పొడిగింపు

By Staff
|

Shiney Ahuja
ముంబై: పని మనిషిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న బాలీవుడ్ నటుడు షైనీ అహుజా జ్యుడిష్యల్ కస్టడీని కోర్టు మరోమారు పొడిగించింది. ఈ నెల 16వ తేదీ వరకు ఆయనను జ్యుడిష్యల్ కస్టడీకి పంపుతూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అహుజా పని మనిషిపై అత్యాచారానికి పాల్పడినట్లు పరీక్షల్లో తేలడంతో ఆయనకు బెయిల్ లభించడం కష్టమేనని న్యాయనిపుణులు అంటున్నారు.

జ్యుడిషియల్ కస్టడీ గడువు ముగియడంతో ఆయనను అధికారులు గురువారంనాడు అంధేరీ కోర్టు ముందు హాజరు పరిచారు. సెషన్స్ కోర్టులో ఆయన గత వారం బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు. అది శుక్రవారం విచారణకు రానుంది. అహుజాను పోలీసులు గత నెల 15వ తేదీన అరెస్టు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X