హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యేపై వైయస్ కు ఫిర్యాదు

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్‌: కొవ్వూరు తెలుగుదేశం శాసనసభ్యుడు టీవీ రామారావుపై చర్య తీసుకోవాలని కోరుతూ స్పృహ నర్సింగ్‌ కళాశాలలోచదువుకున్న కేరళ విద్యార్థినులు సోమవారంనాడు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలిశారు. రామారావు తమపై అత్యాచారయత్నం చేశారని ఆరోపిస్తూ కేరళ విద్యార్థినులు ఇప్పటివరకు గవర్నర్‌తోపాటు హోంమంత్రి, మానవహక్కుల కమిషన్‌ను కలిశారు. సోమవారంనాడు వారు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిశారు.

ఇదిలా ఉంటే, తీవ్రవాద నిర్మూలన కమిటీ ఆక్టోపస్‌ విధి విధానాలపై ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఆక్టోపస్‌ను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆక్టోపస్‌ శిక్షణకు, భవన సముదాయం సమకూర్చుకునేందుకు 60 నుంచి 90 ఎకరాల స్థలాన్ని ఇచ్చేందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఈనెల 14వ తేదీలోగా ప్రణాళిక రూపొందించి తదుపరి సమీక్షలో సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ ఎస్‌ఎస్‌పీ యాదవ్‌, ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X