వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెన్సెక్స్ 700 పాయింట్లు నష్టం

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబై:ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ మార్కెట్ల వర్గాలను నిరుత్సాహపరిచింది. 2009-10 ఆర్థిక సంవత్సరంలో జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) 6.8 శాతం మేరకు వృద్ధిని సాధించాలనే దృక్పథంతో ప్రణబ్ ఈ బడ్జెట్‌ను రూపొందించారని, కానీ అవి మార్కెట్లకు రుచించేలా లేవని ఓ నిపుణుల విభాగం వెల్లడించింది.

ప్రణబ్ బడ్జెట్ మార్కెట్ల వృద్ధికి దోహదం చేయవచ్చనే వార్తలు వెలువడటంతో సోమవారం ఉదయం ఉదయం స్టాక్ మార్కెట్ లాభాలతో మొదలైంది. అయితే ఈ బడ్జెట్‌లో భాగంగా పన్ను సంబంధిత అంశాలపై ప్రణబ్ ప్రకటించిన అనంతరం బీఎస్ఈ సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా నష్టపోయింది.

ప్రస్తుతం ఒక్కో రంగం వారీగా చూస్తే..చమురు మరియు సహజవాయువుల ఇండెక్స్ భారీగా నష్టాలను చవిచూడగా.. ఆ తర్వాతి స్థానాల్లో మెటల్ ఇండెక్స్, బ్యాంకెక్స్‌లు ఉన్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 481 పాయింట్లు కోల్పోయి 14,432 వద్దకు పడిపోగా..నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ కూడా 167 పాయింట్లు నష్టపోయి 4,258 వద్దకు చేరుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X