వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రణబ్ ది మంచి బడ్జెట్: ప్రధాని

By Staff
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
న్యూఢిల్లీ: ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ భారత్ కు, ఇండియాకు మధ్య తారతమ్యాన్ని తొలగించేందుకు ప్రయత్నించిందని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పారు. ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రశాంసర్హమైన కృషి చేశారని, క్లిష్టమైన ఆర్థిక పరిస్థితులున్న కాలంలో సమతుల్య బడ్జెట్ ను ప్రతిపాదించారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్రభావాన్ని తగ్గించేందుకు బడ్జెట్ ప్రయత్నించిందని ఆయన చెప్పారు. గ్రామీణాభివృద్ధికి బడ్జెట్ దోహదం చేస్తుందని ఆయన కొనియాడారు. ప్రభుత్వం ఆమ్ ఆద్మీపై ప్రత్యేక శ్రద్ద చూపుతోందని, అందుకు అనుగుణంగా బడ్జెట్ ఉందని ఆయన చెప్పారు. స్వల్పకాలిక ఆర్థిక అవసరాలను మాత్రమే కాకుండా మధ్య కాలిక అవసరాలను కూడా తీర్చే విధంగా బడ్జెట్ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X