• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

'సత్యం' రాజు ఇంటి ముందు ధర్నా

By Staff
|

Ramalinga Raju
హైదరాబాద్‌: సొంతిళ్లు కట్టిస్తామని తమ వద్ద నుంచి మెటాస్‌ సంస్థ వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇవ్వాలంటూ చందాదారులు శుక్రవారం ధర్నాకు దిగారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని 'సత్యం' మాజీ చైర్మన్ రామలింగరాజు ఇంటి ముందు 250 మంది నిరసన చేపట్టి సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాచుపల్లి వద్ద సొంతిళ్లు కట్టిస్తామని మెటాస్‌ సంస్థ పలువురి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసింది.

బాచ్ పల్లిలో హిల్ కౌంటీ వెంచర్ పేరుతో సొంతిళ్లు కట్టిస్తామని మేటాస్ 630 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తమ సొమ్ము తిరిగి ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. రామలింగరాజు ఇంటి ముందు శనివారం నిరాహార దీక్షకు దిగుతామని వారు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X