ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిమా చౌదరికి తెల్ల రేషన్ కార్డు

By Staff
|
Google Oneindia TeluguNews

Mahima Chowdary
ఏలూరు: బాలీవుడ్ నటి మహిమా చౌదరి కూడా తెల్ల రేషన్ కార్డు జారీ చేసి ప్రభుత్వాధికారులు తమ ఉదారతను చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ధర్మాజిగూడాలో ఆమెకు తెల్ల రేషన్ కార్డు ఇచ్చింది. పేదలకు రెండు రూపాయలకు కిలో బియ్యం వంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అందించడానికి తెల్ల రేషన్ కార్డు ఇస్తారు. ఆమెకు ఆరోగ్యశ్రీ కార్డు కూడా జారీ చేశారు.

మహిమా చౌదరి ఫొటోతో జారీ అయిన తెల్ల రేషన్ కార్డును తెలుగు టీవీ చానెళ్లు శుక్రవారం ప్రసారం చేశాయి. ఇది తమకేమీ తెలియదని, కార్డు హైదరాబాదు నుంచే వచ్చిందని స్థానిక అధికారులు అంటున్నారు. మహిమా చౌదరి ఇంటి చిరునామా, కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఆ కార్డు మీద ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X