మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేనే పెద్ద నక్సలైట్ ని: ఎమ్మెల్యే

By Staff
|
Google Oneindia TeluguNews

గజ్వేల్‌: తానే ఒక పెద్ద నక్సలైట్‌నని మెదక్‌ జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి అన్నారు. నక్సలైట్ల పేరు చెప్పుకుని తిరిగిన వారు ఎవరూ నక్సలైట్లు కాలేరని, వారి సిద్ధాంతాలను అమలుచేసిన తనలాంటి వారే నిజమైన నక్సలైట్లని ఆయన చెప్పుకొచ్చారు. గజ్వేల్‌ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన సన్మాన సభలో సోమవారం ఆయన ప్రసంగించారు.

తాను మంత్రిగా ఉండగా తొగుట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చానని చెప్పారు. నక్సలైట్లు గ్రా మీణ ప్రాంతాల పేదల సంక్షేమాన్ని కోరుకుంటారని తాను అదే చేశానని చె ప్పారు. నక్సలైట్ల పేరు చెప్పుకుని తిరిగేవారు ఎప్పుడూ నక్సలైట్‌ కాలేరని పరోక్షంగా దొమ్మాట మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. తనను రాజకీయంగా పతనంచేయాలని చూసిన టీడీపీ అధినేత చంద్రబాబు, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌లు తన గెలుపుతో తలదించుకున్నారన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X