లండన్: ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ కు బ్రిటన్ కు చెందిన మిడిలెసెక్స్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. శుక్రవారం వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ మైఖేల్ డ్రిస్కాల్ ఈ డాక్టరేట్‌ను రెహ్మాన్ కు అందజేశారు. ఈ సందర్భంగా రెహ్మాన్ కు చెందిన కేఎం మ్యూజిక్ కన్జర్వేటరీ(చెన్నై)కి, మిడిలెసెక్స్ వర్సిటీకి మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.