వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మహారాష్ట్రను దోషిగా నిలబెడతాం:పొన్నాల
వరంగల్: బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో మహరాష్ట్ర ప్రభుత్వాన్ని, అక్కడి ప్రజలను కేంద్ర ప్రభుత్వం ముందు దోషులుగా నిలబెడతామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వరంగల్లో అన్నారు. రాజ్యాంగ పరంగా చట్టపరంగా మహరాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి జలదోపిడికీ పాల్పడకుండా ఉండేందుకు వివిద స్థాయిల్లో ఒత్తిడి పెంచుతున్నట్లు చెప్పారు. బాబ్లీప్రాజెక్టు నిర్మాణానికి శిలాఫలకం వేసిన సమయంలో అప్పటి ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించి, ప్రస్తుతం తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేయటం తగదన్నారు.