వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీవీకి గుండె జబ్బు లేదు: వైద్యులు

By Staff
|
Google Oneindia TeluguNews

TV Rama Rao
విశాఖపట్నం: తెలుగుదేశం శాససనభ్యుడు టీవీ రామారావుకు గుండె జబ్బు లేదని వైద్యులు తేల్చారు. రామారావుకు హైబీపీ మాత్రమే ఉందని వారు చెప్పారు. నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారం, హత్య కేసులో ఆయనను సిబిసిఐడి అధికారులు సోమవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వెంటనే ఆయనను ఏలూరు కోర్టులో ప్రవేశపెట్టారు. ఆయనకు వచ్చే నెల 3వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం కోర్టు వెలుపలికి వస్తున్న సమయంలో రామారావు ఛాతీ నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు.

ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని వైద్యులు చెప్పడంతో ఆయనను విజయవాడకు తరలించారు. అర్థరాత్రి దాటిన తర్వాత రామారావును గుంటూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు జరిగాయి. రామారావుకు గుండె జబ్బు లేదని, హైబీపీ మాత్రమే ఉందని వైద్యులు తేల్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X