హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ లో గ్రహణం పాక్షికమే

By Staff
|
Google Oneindia TeluguNews

Solar Eclipse
హైదరాబాద్: రేపు బుధవారం సంభవించే సంపూర్ణ సూర్యగ్రహణం హైదరాబాదులో పాక్షికంగానే కనిపిస్తుంది. హైదరాబాదులో దాదాపు 85 శాతం సంపూర్ణ సూర్యగ్రహణం ఉంటుందని ఆస్ట్రో క్లబ్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ అంటున్నారు. బుధవారం తెల్లవారు జామున 5.33 గంటల నుంచి 8.50 గంటల వరకు సంపూర్ణ సూర్యగ్రహణం ఉంటుంది.

పదమూడేళ్ల క్రితం సంపూర్ణ గ్రహణం ఏర్పడింది. ఆ తర్వాత ఇప్పుడే సంపూర్ణ సూర్యగ్రహణం వస్తోంది. సంపూర్ణ సూర్యగ్రహ వీక్షణాన్ని పలువురు అద్భుతమైన అనుభవంగా పరిగణిస్తున్నారు. నేరుగా సూర్యగ్రహణాన్ని చూడకూడదని చెబుతున్నారు. సన్ వ్యూ సోలార్ ఫిల్టర్ కళ్లద్దాల ద్వారా చూడాలని సూచిస్తున్నారు. సోలార్ ఫిల్టర్ లో డబుల్ మైలార్ ఫిల్మ్ ఉంటుందని, దాని వల్ల హాని ఉండదని చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X