హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తప్పుకుంటా: కసబ్ లాయర్ కజ్మీ

By Staff
|
Google Oneindia TeluguNews

Ajmal Amir Kasab
హైదరాబాద్‌: కసబ్ కు తనపై తనకు నమ్మకం లేనందున తాను తప్పుకోవాలని అనుకుంటున్నట్లు ఆయన తరఫు న్యాయవాది అబ్బాస్ కజ్మీ చెప్పారు. ముంబై దాడుల కేసులో నిందితుడు అజ్మల్ కజ్మీపై విచారణ కొనసాగించాలని ప్రత్యేక కోర్టు గురువారం నిర్ణయించింది. కసబ్ అంగీకారాన్ని కోర్టు రికార్డుల్లో భాగంగా చూస్తామని, తర్వాత దాన్ని పరిగణనలోకి తీసుకుంటామని, సాక్షులను విచారిస్తామని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంఎల్ తహిల్యానీ చెప్పారు.

కసబ్ తన నేరాన్ని అంగీకరించడం ద్వారా అందర్నీ అశ్చర్యంలో ముంచెత్తాడు. తనను ఉరి తీయాలని కూడా అన్నాడు. తాను చేసిందేదో చేశానని, ఈ ప్రపంచంలో తాను ఈ పని చేశానని, ఈ ప్రపంచం తనను శిక్షించాలని, తాను భగవంతుడి శిక్ష కోసం చూస్తున్నానని, తాను మరణశిక్ష నుంచి తప్పించుకోవడానికే నేరాన్ని అంగీరించినట్లు ఎవరైనా భావిస్తే తనకు మరణశిక్షనే ఖాయం చేయాలని కసబ్ బుధవారంనాడు కోర్టులో అన్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X