వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కలామ్ కు వ్యక్తిగతంగా క్షమాపణలు'

By Staff
|
Google Oneindia TeluguNews

Abdul Kalam
న్యూఢిల్లీ‌: భారత మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలామ్ ను వ్యక్తిగతంగా కలిసి క్షమాపణలు చెప్తామని అమెరికాకు చెందిన కాంటినెంటల్ ఎయిర్ లైన్స్ తెలిపింది. కాంటినెంటల్ ఎయిర్ లైన్స్ నుంచి తనకు క్షమాపణలు చెబుతూ ఏ విధమైన పత్రమూ రాలేదని కలామ్ గురువారం చెప్పారు. ఈ పరిస్థితిలో కాంటినెంటల్ ఎయిర్ లైన్స్ ప్రతిస్పందించింది. కలామ్ ఢిల్లీలో లేనందున ఆయన తిరిగి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా కలిసి క్షమాపణలు చెప్పడానికి నిరీక్షిస్తున్నట్లు కాంటినెంటల్ ఎయిర్ లైన్స్ తెలిపింది.

కలామ్ ను అవమానించినందుకు క్షమాపణలు చెప్పినట్లు కాంటినెంటల్ ఎయిర్ లైన్స్ బుధవారం తెలిపింది. కలామ్ కు ఏదైనా ఇబ్బంది కలిగితే క్షమాపణలు చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని, కలామ్ భావోద్వేగాలను దెబ్బ తీయడం తమ ఉద్దేశ్యం కాదని ఆ సంస్థ ఒక ప్రకటనలో అన్నది. అమెరికా, భారత్ విమాన భద్రతా నిబంధనల మధ్య ఉన్న తేడా వల్లనే ఆ సంఘటన జరిగిందని పేర్కొంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X