• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జమ్మూ కాశ్మీర్ సిఎం ఒమర్ రాజీనామా

By Staff
|

Omar Abdullah
శ్రీనగర్: పిడిపి ఆరోపణలకు తీవ్ర మనస్తాపం చెందిన ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన మంగళవారంనాడు గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాకు సమర్పించారు. నేషనల్ కాన్ఫరెన్స్ శాసనసభ్యులు, మంత్రులు వారిస్తున్నా వినకుండా ఆయన నేరుగా శాసనసభ నుంచి రాజభవన్ కు చేరుకుని తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ సంఘటన రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది.

2006 సెక్స్ కుంభకోణంలో తన పాత్ర ఉన్నట్లు పిడిపి సభ్యుడు ముజఫర్ బేగ్ శాసనసభలో ఆరోపించడంతో ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా ఒమర్ అబ్దుల్లాతో పాటు రాజభవన్ కు చేరుకున్నారు. ఈ విధమైన మానసిక హింసను తాను భరించలేనని, ఆరోపణలు రుజువయ్యేంత వరకు నిర్దోషినని ఒమర్ అన్నారు. తాను రాజీనామా చేస్తున్నానని ఒమర్ ప్రకటించినప్పుడు శాసనసభలో తీవ్ర గందరగోళం చెలరేగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X