• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సెక్స్ స్కామ్ లో ఒమర్: పిడిపి

By Staff
|

Omar Abduallah
హైదరాబాద్: నిరుటి శ్రీనగర్ సెక్స్ కుంభకోణంలో జమ్మా కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పాత్ర ఉందని పిడిపి సీనియర్ నాయకుడు ముజఫర్ బేగ్ ఆరోపించారు. దీంతో ఆగ్రహం చెందిన ఒమర్ అబ్దుల్లా తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తాను వెంటనే రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పిస్తానని కూడా చెప్పారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కానీ తాను రాజీనామా చేసి తనపై ఆరోపణలు అబద్ధమని రుజువు చేయించుకుంటానని, తాను నిర్దోషినని తేలేంత వరకు పని చేయలేనని, తన వ్యక్తిత్వంపై ఇదో మచ్చ అని అబ్దుల్లా అన్నారు.రాష్ట్ర శాసనసభలో ఆయన ఈ విషయం ప్రకటించి సంచలనం సృష్టించారు.

అబ్దుల్లా ప్రకటనతో శాసనసభ్యులు, మంత్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. తాను మాట్లాడి బయటకు వెళ్లిపోవడానికి సిద్ధమైన అబ్దుల్లాను అపడానికి శాసనసభ్యులు, మంత్రులు తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. తనను ఈ తొలి అడుగు వేయనివ్వండని ఆయన కోరారు. సెక్స్ కుంభకోణంలో ఉన్నవారి పేర్ల జాబితా తన వద్ద ఉందని, ఇందులో అబ్దుల్లా పేరు కూడా ఉందని బేగ్ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X