• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

దేవేందర్ తో అల్లు అరవింద్ భేటీ

By Staff
|

Allu Aravind
హైదరాబాద్: తమ పార్టీ నాయకుడు టి.దేవేందర్ గౌడ్ ను ప్రజారాజ్యం పార్టీ ప్రధాన కార్యదర్శి, చిరంజీవి బావ మరిది అల్లు అరవింద్ బుజ్జగించే ప్రయత్నంలో పడ్డారు. బుధవారంనాడు అల్లు అరవింద్ దేవేందర్ గౌడ్ తో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పార్టీ నాయకుడు సి రామచంద్రయ్య కూడా పాల్గొన్నారు. దేవేందర్ గౌడ్ ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతారనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో అల్లు అరవింద్ భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అల్లు అరవింద్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. దేవేందర్ గౌడ్ ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చేరే విషయమై ఇ.పెద్దిరెడ్డితో, రవికుమార్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది.

దేవేందర్ గౌడ్ తో పాటు ప్రజారాజ్యంలోని పలువురు పాత తెలుగుదేశం నాయకులు సొంత గూటికి చేరుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, దేవేందర్ గౌడ్ తిరిగి తమ పార్టీలోకి రావడాన్ని అడ్డుకోబోనని తెలుగుదేశం నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి బుధవారం అన్నారు. దేవేందర్ తో పాటు తమ పార్టీ పాత నాయకులందరినీ తిరిగి తెలుగుదేశంలోకి ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X