వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిబిఐ ఒమర్ కొమ్ము కాస్తోంది: ముఫ్తీ

By Staff
|
Google Oneindia TeluguNews

Omar Abdullah
శ్రీనగర్: సెక్స్ కుంభకోణంపై జమ్మూ కాశ్మీర్ శాసనసభ వరుసగా బుధవారం మూడో రోజు కూడా స్తంభించింది. 2006 సెక్స్ కుంభకోణంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని పిడిపి డిమాండ్ చేస్తోంది. సిబిఐ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు సహాయం చేస్తోందని పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపిస్తూ శాసనసభలో సిబిఐ పత్రాలను చించేశారు. సెక్స్ కుంభకోణంలో ఒమర్ పేరు లేదంటూ సిబిఐ రాసిన లేఖను స్పీకర్ అక్బర్ లోన్ సభ ముందుంచారు. అయితే దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయించాలని పిడిపి డిమాండ్ చేసింది.

మెహబూబా ముఫ్తీతో పాటు పిడిపి సభ్యుల సభలో ఆందోళనకు దిగారు. సిబిఐ ఒమర్ ను కాపాడడానికి ప్రయత్సిస్తోందంటూ నినాదాలు చేశారు. తమ పేర్లు సెక్స్ కుంభకోణంలో ఏ దశలోనూ లేవని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆయన తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా అంటున్నారు. సెక్స్ స్కాంలో తన పేరున్నట్లు పిడిపి సభ్యుడు బేగ్ మంగళవారం శాసనసభలో ఆరోపించిన వెంటనే ఒమర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే ఆ రాజీనామాను గవర్నర్ వోహ్రా తిరస్కరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X