వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐష్, అభిలకు తప్పిన ముప్పు

By Staff
|
Google Oneindia TeluguNews

Aishwarya-Abhishek
తిరుచూరు: బాలీవుడ్ దంపతులు ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్ లు గురువారం పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మిస్తున్న రావణ్ షూటింగ్ లో ఈ ముప్పు తప్పింది. ఈ చిత్రం షూటింగ్ కేరళలోని తిరుచూరులో జరుగుతోంది. ఈ చిత్రం కోసం తెచ్చిన ఏనుగు షూటింగ్ లో రణరంగం సృష్టించింది.

ఏనుగు కోపానికి గురైన మావటి అక్కడికక్కడికే మరణించినట్లు తెలిసింది. ఏనుగును అదుపు చేయడానికి చేసిన అతని ప్రయత్నం ఫలించకపోగా అతని ప్రాణాలే పోయాయి. ఈ సంఘటన జరిగినప్పుడు అక్కడికి అతి సమీపంలోనే ఐష్, అభిషేక్ లున్నారు. ప్రమాదం నుంచి వారు బయటపడడంతో షూటింగ్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ సినిమాలో వారిద్దరు నటిస్తున్న విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X