వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బూటా కొడుకుని ప్రశ్నించిన సిబిఐ

By Staff
|
Google Oneindia TeluguNews

Buta Singh
ముంబై: కోటి రూపాయల లంచం తీసుకున్నాడనే ఆరోపణలో కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) మాజీ కేంద్ర మంత్రి బూటా సింగ్ కుమారుడు సరబ్జోత్ అలియాస్ స్వీటీ సింగ్ ను ప్రశ్నించింది. గురువారం రాత్రి ఢిల్లీలో అదుపులోకి తీసుకున్న స్వీటీ సింగ్ ను సిబిఐ అధికారులు ముంబైకి తీసుకొచ్చారు. హవాలా డీల్ వంటి ఇతర ఆర్థిక లావాదేవీల్లో స్వీటీ సింగ్ పాత్రపై కూడా తాము దృష్టి పెట్టినట్లు సిబిఐ పశ్చిమ ప్రాంతం జాయింట్ డైరెక్టర్ ఆర్ఆర్ సింగ్ గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత చెప్పారు.

రాత్రి చాలా పొద్దుపోయే వరకు స్వీటీ సింగ్ ను ప్రశ్నించామని, అయితే స్వీటీసింగ్ ను అదుపులోకి తీసుకోవడం గానీ అరెస్టు చేయడం గానీ జరగలేదని ఆయన చెప్పారు. నాసిక్ కు చెందిన సివిల్ పనుల కాంట్రాక్టర్ రామారాజు పాటిల్ ఫిర్యాదు మేరకు కోటి రూపాయల లంచం కేసులో సిబిఐ అధికారులు స్వీటీ సింగ్ ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X