హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంతా 'మగధీర' హంగామా

By Staff
|
Google Oneindia TeluguNews

Magadheera
హైదరాబాద్: రామ్ చరణ్ తేజా నటించిన మగధీర చిత్రం విడుదల సందర్భంగా రాష్ట్రంలో శుక్రవారం ఉదయం నుంచే హంగామా చోటు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో పాటు రామచరణ్ అభిమానుల సందడి రాష్ట్రంలోని అన్ని థియేటర్ల వద్ద చోటు చేసుకుంది. తొలి రోజు తొలి షో చూసేందుకు అభిమానులు పెద్ద యెత్తున థియేటర్ల వద్ద గంటల తరబడి పడిగాపులున్నారు. హైదరాబాదులోని ఐ మాక్స్ లో గురువారం రాత్రి ప్రివ్యూలు వేశారు. శుక్రవారం ఉదయం నుంచే అభిమానులు టికెట్ల కోసం వేచి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1200 థియేటర్లలో శుక్రవారం విడుదలవుతోంది.

కాగా, రాష్ట్రంలో అంతటా మగధీర సందడే. థియేటర్ల వద్ద టికెట్ల కోసం అభిమానులు ఆందోళనలకు దిగుతున్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాకలో మోహినీ థియేటర్ పై రామచరణ్ అభిమానులు దాడులు చేశారు. అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటలకు టికెట్లు ఇస్తామని థియేటర్ యాజమాన్యం చెప్పడంతో పెద్ద యెత్తున అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా విధ్వంసం చోటు చేసుకుంది. మెహినీ థియేటర్ లోకి ప్రవేశించి అభిమానులు విధ్వంసం సృష్టించారు. ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తల సందడి కూడా దానికి తొడైంది.

మగధీర సినిమాను హాలీవుడ్ స్థాయిలో నిర్మించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది పునర్జన కథాంశం మీద ఆధారపడి నిర్మించినట్లు చెబుతున్నారు. కత్తి యుద్ధాలు తదితర భీకర సన్నివేశాలున్నాయని అంటున్నారు. 18 ఏళ్ల లోపువారికి థియేటర్ల యజమానులు టికెట్లు ఇవ్వడం లేదు. దీంతో సినిమాలో సన్నివేశాలపై మరింత ఉత్సుకత చెలరేగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X