వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బూటా సింగ్ చుట్టూ ఉచ్చు

By Staff
|
Google Oneindia TeluguNews

Buta Singh
న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ కులాలు, తెగల జాతీయ కమిషన్ చైర్మన్ బూటా సింగ్ చుట్టూ ఉచ్చు బిగిసుకుంటోంది. ఆయన కుమారుడు సరబ్జోత్ సింగ్ కోటి రూపాయల లంచం తీసుకుంటున్నట్లు అంగీకరించిన నేపథ్యంలో సిబిఐ బూటా సింగ్ ను కూడా ప్రశ్నించడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. లంచం కేసులో ప్రధాన నిందితుడు సరబ్జోత్ తాను లంచం తీసుకున్న విషయం తన తండ్రి బూటా సింగ్ కు కూడా తెలుసునని సిబిఐకి చెప్పినట్లు తెలుస్తోంది.

నాసిక్ సివిక్ వర్క్స్ కాంట్రాక్టర్ రామారావు పాటిల్ విషయాన్ని పరిష్కరించడానికి తాను చేసుకున్న ఒప్పందాన్ని తన తండ్రికి చెప్పానని సరబ్జోత్ వివరించినట్లు సిబిఐ వర్గాలు చెబుతున్నాయి. బూటా సింగ్ ను ప్రశ్నించడానికి రాజ్యాంగపరంగా తమకు అనుమతి లభించాల్సి ఉందని, అనుమతి లభించగానే బూటా సింగ్ ను ప్రశ్నిస్తామని ఆ వర్గాలు చెబుతున్నాయి. బూటా సింగ్ లాండ్ లైన్ నుంచి వెళ్లిన ఫోన్ కాల్స్ వివరాలు కూడా సిబిఐ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది.

గత 12 రోజులుగా పలువురు హవాలా ఆపరేటర్లు సరబ్జోత్ సింగ్ మాట్లాడినట్లు తెలుస్తోంది. పాటిల్ ఫిర్యాదుతో వాటిని ట్రాప్ చేసే పనిలో సిబిఐ అధికారులు పడ్డారు. సరబ్జోత్ ను సిబిఐ అధికారులు గురువారం అరెస్టు చేశారు. సరబ్జోత్ ను ఆగస్టు 15వతేదీ వరకు సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X