హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోజా కూడా వస్తామన్నారు: వైయస్

By Staff
|
Google Oneindia TeluguNews

Roja
హైదరాబాద్: తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజా కూడా ఎన్నికలకు ముందు కాంగ్రెసు పార్టీలోకి రావడానికి ప్రయత్నించారని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. కాంగ్రెసులోకి రావడానికి రోజాలాంటి వారు కూడా ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. బుధవారం శాసనసభ ఆవరణలో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో ఇబ్బంది పడుతున్న వారు చాలా మంది ఉన్నారని ఆయన అన్నారు. తాము ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ఇతర పార్టీలోని వారిని కాంగ్రెసులోకి ఆహ్వానిస్తున్నామనే విమర్శలో నిజం లేదని, వారే స్వచ్ఛందంగా కాంగ్రెసులో చేరుతున్నారని ఆయన చెప్పారు.

కృష్ణా - గోదావరి బేసిన్ గ్యాస్ విషయంలో వస్తున్న విమర్శల్లో నిజం లేదని ముఖ్యమంత్రి అన్నారు. కెజి బేసిన్ ద్వారా రాష్ట్రంలో ఇంటింటికీ పైపులైన్ల ద్వారా గ్యాస్ ను అందిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు తాము ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము సిద్ధంగానే ఉన్నామని ఆయన చెప్పారు. అక్టోబరు నెలలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X