జమ్ము: జమ్మూ కాశ్మీర్ లోని దోడా జిల్లాలో భద్రతా బలగాల చేతిలో టాప్ హిజ్బుల్ ముజాహిదీన్ మిలిటెంట్ బుధవారం ఉదయం హతమయ్యాడు. తమకు అందిన సమాచారం మేరకు దోడా జిల్లాలోని బెహోటా - మర్మాత్ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సమయంలో ఎదురుకాల్పులు జరిగాయి.
ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ సెక్షన్ కమాండర్ నూర్ మొహమ్మద్ ఆలియాస్ మన్సూర్ హతమైనట్లు అధికార వర్గాలు చెప్పాయి. సంఘటనా స్థలం నుంచి ఎకె రైఫిల్, మూడు మాగజీన్లు స్వాధీనం చేసుకున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి