వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎల్టీటిఇ నేత పద్మనాథన్ అరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

Pathmanathan
కొలంబో: లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్టీటిఇ) కొత్త నేత కుమారన్ పద్మనాథన్ అలియాస్ కెపి బ్యాంగాక్ లో అరెస్టయ్యాడు. అతన్ని అరెస్టు చేసి కొలంబోకు పంపిస్తున్నట్లు శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్ష సోదరుడు, సీనియర్ సలహాదారు బాసిల్ రాజపక్ష ఒక ఆంగ్ల దినపత్రికతో చెప్పారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో పద్మనాథన్ నిందితుడు. ఇంటర్ పోల్ అతని కోసం గాలిస్తోంది.

వేలుపిళ్లై ప్రభాకరన్ మృతి తర్వాత ఎల్టీటిఇ కొత్త నేతగా కెపి ఎంపికయ్యాడు. మేలో ఎల్టీటిఇ శ్రీలంక బలగాల చేతిలో ఓడిపోయే వరకు పద్మనాథన్ టైగర్స్ అంతర్జాతీయ సంబంధాల చీఫ్ గా పనిచేస్తున్నాడు. అతని అరెస్టు విషయం గురువారం రాత్రి పొద్దు పోయిన తర్వాత తెలిసింది. ప్రభుత్వ సమాచార శాఖ ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ప్రభాకరన్ హత్య తర్వాత కెపి అరెస్టు ఎల్టీటిఇకి మరో పెద్ద దెబ్బ.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X