హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవితో ఎర్రంనాయుడు భేటీ

By Staff
|
Google Oneindia TeluguNews

Yerram Naidu
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవితో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కె. ఎర్రంనాయుడు సోమవారం శాసనసభ ఆవరణలో సమావేశమయ్యారు. తమ్మినేని సీతారాం ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతారనే వార్తలు బలపడుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం చేకూరింది. తమ్మినేని సీతారాం ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీలోకి రావడం సంతోషకరమైన విషయమని ఎర్రంనాయుడు చిరంజీవితో సమావేశానంతరం అన్నారు. తమ్మినేనిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. పార్టీని వీడే సమయంలో తనపై చేసిన విమర్శలకు తమ్మినేని వివరణ అడగలేదని ఆయన చెప్పారు.

రెండు రాష్ట్రాల మధ్య గల జలవివాదంపై కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. ఈ ఘటనపై మొయిలీని కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కర్ణాటక ఎగువన నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులు అక్రమం ఎలా అవుతాయని వీరప్ప మొయిలీ ఆదివారం ప్రశ్నించారు. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కర్ణాటకకు చెందిన మొయిలీ వ్యాఖ్య పక్షపాతంతో కూడిందని అభిప్రాయపడుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X