హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దయా పోలీసుల వద్ద ఉండొచ్చు: వివి

By Staff
|
Google Oneindia TeluguNews

Maoists
హైదరాబాద్: మావోయిస్టు ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు (ఎఓబి)ల కార్యదర్శి దయా పోలీసుల అదుపులో ఉండవచ్చునని విప్లవ రచయితల సంఘం (విరసం)నేత వరవరరావు అంటున్నారు. మావోయిస్టు అగ్రనేతలు రామకృష్ణ, సుధాకర్ పోలీసులకు చిక్కి ఉండకపోవచ్చునని కూడా ఆయన అన్నారు. రామకృష్ణ, సుధాకర్, దయాలను పోలీసులు అరెస్టు చేసినట్లు గురువారం అర్థరాత్రి నుంచి వార్తలు వస్తున్నాయి.

కాగా, తమ అదుపులో మావోయిస్టు అగ్రనేతలు ఎవరూ లేరని పోలీసు అధికారులంటున్నారు. ఎఓబిలో పోలీసులు తీవ్రంగా గాలింపు జరుపుతున్నారు. గాలింపు చర్యలను వారు ముమ్మరం చేశారు. రెండు రోజుల క్రితం పోలీసుల చేతిలో ముగ్గురు మహిళా నక్సలైట్లు హతమయ్యారు. వారి వద్ద రెండు ఎకె 47 రైఫిళ్లు లభించడాన్ని బట్టి మావోయిస్టు అగ్రనేతలు పోలీసుల అదుపులో ఉండవచ్చుననే అనుమానాలు తలెత్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X