వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మలేసియాలో భారత కుక్స్ ఔట్

By Staff
|
Google Oneindia TeluguNews

Indian chefs
కౌలాలంపూర్: మలేసియాలో భారత వంటగాళ్లకు, క్షురకులకు గడ్డు కాలం ఎదురయ్యే పరిస్థితి ఉంది. ఈ రంగాల్లో స్థానికులను నియమించడానికి మలేసియా ప్రభుత్వం శిక్షణ ఇస్తోంది. మలేసియన్ ఇండియన్ రెస్టారెంట్లలో స్థానిక వంటగాళ్లను నియమించనున్నట్లు, చెఫ్స్ ను భారత నుంచి తీసురాబోమని మానవ వనరుల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ సుబ్రహ్మణ్యం చెప్పారు.

దశలవారీగా భారత్ నుంచి వంటగాళ్లను రప్పించే పద్ధతికి స్వస్థి పలుకుతామని, తొలి దశలో శిక్షణ పొందినవారు సిద్ధంగా కాగానే ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. వంటలో శిక్షణ పొందడానికి స్థానికులు విశేషంగా ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. ప్రధాని నజీబ్ తున్ రజాక్ ఆలోచనకు తాము కార్యరూపం ఇస్తున్నట్లు చెప్పారు. హెయిర్ స్టయిలింగ్ లో కూడా స్థానికులకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. భారత క్షురకులను స్వస్తి చెప్పేందుకు ఈ శిక్షణకు శ్రీకారం చుట్టింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X