వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇలేష్ ను ప్రేమిస్తున్నా: రాఖీ

By Staff
|
Google Oneindia TeluguNews

Rakhi Sawant
ముంబై: సంచలనాలకు మారుపేరైన ఐటం గర్ల్ రాఖీ సావంత్ పూటకో మాట మాట్లాడుతోంది. ఇలేష్, తాను మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదని వచ్చిన వార్తలపై ఆమె మండిపడుతున్నారు. ఆ వార్తలన్నీ చెత్త అని ఆమె అంటోంది. తామిద్దరం చాలా సంతోషంగా ఉన్నామని, పరస్పరం ప్రేమించుకుంటున్నామని ఆమె చెబుతోంది. ఇలేష్ కుటుంబ సభ్యులందరినీ తాను కలిశానని, అతనితో కలిసి కెనడాకు కూడా వెళ్తున్నానని, అతనితో తనకు భవిష్యత్తు ఉందని భావిస్తున్నానని ఆమె అంటోంది.

తన మాజీ బాయ్ ఫ్రెండ్ అభిషేక్ అవస్థి పట్ల కూడా ఆమె సున్నితంగానే వ్యవహరిస్తోంది. అతనితో తాను నాలుగేళ్లు కలిసి తిరిగానని, దాన్ని అంత సులభంగా మర్చిపోవడం సాధ్యం కాదని ఆమె చెబుతోంది. ఇలేష్ తో పెళ్లి ప్రస్తావనను మాత్రం దాటేస్తోంది. ప్రస్తుతం ఇద్దరం ఒకరినొకరం అర్థం చేసుకునే క్రమంలో ఉన్నానమి, సెట్ లోనే తామిద్దరం కలిశామని, పరస్పర అవగాహనకు కొంత సమయం పడుతుందని ఆమె అంటోంది. మరో రియాల్టీ షోకు ప్లాన్ చేస్తున్నట్లు ఆమె ముక్తాయింపు ఇస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X