వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐష్ కు స్వైన్ ఫ్లూ లక్షణాలు

By Staff
|
Google Oneindia TeluguNews

Aishwarya Rai Bachchan
ముంబై: బాలీవుడ తార ఐశ్వర్యా రాయ్ బచ్చన్ కు స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించాయి. ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ తో ఆమెకు స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించినట్లు ఆమె మామ, బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్ లో ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్త అభిషేక్ బచ్చన్ తో కలిసి ఆమె ఊటీలో రావణ్ సినిమా షూటింగులో పాల్గొంటున్నారు. సమాజ్ వాదీ పార్టీ నేత అమర్ సింగ్ ను పరామర్శించడానికి సింగపూర్ వెళ్లిన అమితాబ్ తన కోడలి అనారోగ్యం గురించి బ్లాగ్ లో రాశారు.

ఐశ్వర్యా రాయ్ లో స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించాయి. శనివారం తీవ్రమైన జ్వరంతో కూడా బాధ పడింది. ఆదివారం ఆమె స్థితి కొంచెం బాగుందని ఆయన రాశారు. వారు పెళ్లయినవారు, పరిణతి చెందినవారే కావచ్చు గానీ ఈ సమయంలో తాను పిల్లలకు దగ్గరగా లేకపోవడం బాధ కలిగిస్తోందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X