గుంటూరు: గుంటూరు జిల్లాలో ఓ వైద్య విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ఆమె శవం గుంటూరు జిల్లా నంబూరు పొలాల్లో పడి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఆమె ఎన్నారై వైద్య కళాశాలలో ఎంబిబియస్ మూడో సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం. ఆమెను ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం గ్రామానికి చెందిన వాణిగా గుర్తించారు.
నాగార్జున విశ్వవిద్యలయానికి సమీపంలో జాతీయ రహదారి పక్కన వాణి శవం పడి ఉంది. ఆమె హత్యకు గల కారణాలు తెలియ రాలేదు. ప్రేమ వ్యవహారమేమైనా ఉందా, ఆమెను ఎవరు హత్య చేసి ఉంటారనే కోణం నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.