వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గే సెక్స్ పై కేంద్రానికి సుప్రీం నోటీసు

By Staff
|
Google Oneindia TeluguNews

Supreme Court
న్యూఢిల్లీ: గే సెక్స్ కు చట్టబద్దత కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ క్రిస్టియన్ సంస్థ, యోగా గురు బాబా రామ్ దేవ్ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. కేసు విచారణను ప్రధాన న్యాయమూర్తి కెజి బాలకృష్ణన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ సెప్టెంబర్ 14వ తేదీకి వాయిదా వేసింది. వచ్చే విచారణ నాటికి కేంద్రం వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ప్రభుత్వం తన ప్రతిస్పందనను వినాల్సిన అవసరం ఉందని చెబుతూ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు జులై 20 తేదీన నిరాకరించింది. ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో) నాజ్ ఫౌండేషన్ కు, ఇతర ప్రతివాదులకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X