హైదరాబాద్: తప్పుడు పాస్ పోర్టుతో హైదరాబాద్ చేరుకున్న ఓ వ్యక్తిని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అతనిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దుబాయ్ నుంచి అతను తప్పుడు పాస్ పోర్టుపై ఇక్కడికి చేరుకున్నారు. అతన్ని అనంతపురం జిల్లాకు చెందిన ఇఫ్తెకార్ అహ్మద్ గా గుర్తించారు. అతను బాలకృష్ణ పేరుతో తప్పుడు పాస్ పోర్టుపై షార్జా నుంచి ఇక్కడికి వచ్చాడు.
హైదరాబాదుకు ఉగ్రవాదుల ముప్పు ఉందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన నేపథ్యంలో అనుమానం వచ్చి ఇఫ్తెకార్ అహ్మద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను తప్పుడు పాస్ పోర్టు ద్వారా ఎందుకు ప్రయాణించాడనే కోణం నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇఫ్తెకార్ అహ్మద్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.