వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీ వర్షంతో హైదరాబాద్ జలమయం

By Staff
|
Google Oneindia TeluguNews

Heavy Rains
హైదరాబాద్: గురువారం తెల్లవారు జాము నుంచి కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ నగరం జలమయమైంది. హైదరాబాదులోని నాలాలా పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ అధికారులు ప్రజలకు సూచించారు. తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రులు ఆనం వివేకానందరెడ్డి, దానం నాగేందర్ పరిస్థితిని సమీక్షించారు. వర్షానికి గురువారం ప్రజా జీవితం అస్తవ్యస్తంగా మారింది.పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది.

ఖైరతాబాద్, లక్డికా పూల్, మెహదీపట్నం, పంజాగుట్ట, మలక్ పేట, దిల్ షుక్ నగర్, టోలీ చౌక్, బేగంపేట, కింగ్ కోఠీ వంటి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. నగర శివారు ప్రాంతాలైన శివరాంపల్లి శివాజీనగర్, అత్తాపూర్ ల్లో ఇళ్లలోకి నీరు చేరింది.రాజేంద్ర నగర్ పరిధిలోని మణికొండలో పిరంగోని నాలా పొంగిపొర్లుతోంది. కార్యాలయాలకు, విద్యాసంస్థలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. గుంటూరులోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరులో కూడా ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X