• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ముంబైలో టీవీ నటి అరెస్టు

By Staff
|

Mumbai
ముంబై: ఇంట్లో పనిచేస్తున్న మైనర్ బాలికను వేధించిన టీవీ నటి ఊర్వశి దనోక్రార్ ను పోలీసులు ముంబైలో శనివారం అరెస్టు చేశారు. పదేళ్ల బాలికను ఆమె వేడి వస్తువుతో కాల్చడమే కాకుండా తీవ్రంగా కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. అంధేరీలోని ఆమె ఇంట్లో తనను గత ఆరు నెలలుగా శారీరకంగా హింసిస్తున్నట్లు ఆ బాలిక పోలీసులకు చెప్పింది.

బాలికను పోలీసులు వైద్య పరీక్షలకు పంపించారు. దత్త, విద్యాభ్యాసం పేరు చెప్పి ఆ నటి బాలికను అమరావతి నుచి తన ఇంటికి తెచ్చుకుంది. వారం రోజుల పాటు బాలికను ఆమె నిర్బంధించినట్లు కూడా ఆరోపణలున్నాయి. బాలిక కంటిపై దెబ్బల ఆనవాళ్లు కనిపించాయి. బాలిక ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉంది. ఆమె తల్లిదండ్రులు రావాల్సి ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X