హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పార్టీలోకి మళ్లీ వస్తా: పవన్

By Staff
|
Google Oneindia TeluguNews

Pawan Kalyan
హైదరాబాద్: తమ అన్నయ్య చిరంజీవి జన్మదినం రోజు తమకు పండుగలాంటిదని సినీ హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. చిరంజీవి జన్మదినం రోజు సందర్భంగా అభిమానులతో పాటు ఆయన శనివారం రక్తదానం చేశారు. చిరంజీవి జన్మదినం రోజు తాము రక్తదానం చేయడాన్ని సంప్రదాయంగా పెట్టుకున్నట్లు పవన్ కళ్యాణ్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. తాను టెక్కలి ఉప ఎన్నికల్లో ప్రచారం చేయడం లేదని, భవిష్యత్తులో పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటానని ఆయన చెప్పారు. షూటింగులో బిజీగా ఉన్నందున పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. కొన్ని పొరపాట్ల వల్లనే పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిందని ఆయన చెప్పారు.

అన్నయ్య బ్లడ్ బ్యాంక్ ను ప్రారంభించిన తర్వాత అది ఒక ఉద్యమంలాగా సాగుతోందని ఆయన అన్నారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటానని ఆయన అన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. పార్టీలో పొరపాట్లను తానొక్కడిని విశ్లేషించలేనని, ఆ విషయాలను తాను ఇప్పుడు చెప్పలేనని ఆయన అన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత చాలా రోజులకు ఆయన మీడియా ముందుకు వచ్చారు. చిరంజీవి తన 55వ జన్మదిన వేడుకలను నిరాబంబరంగా శిల్సారామంలో చేసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X